Social Sharing Buttons
Share

Alara Chanchalamaina in Telugu – అలరా చంచలమైనా

Alara Chanchalamaina in Telugu

శ్రీ వేంకటేశ్వరుడు మరియు అలమేలు మంగమ్మల ఊంజల్ సేవను (Dolotsavam) ఎంతో రమణీయంగా వర్ణించే సంకీర్తన ఈ Alara Chanchalamaina in Telugu. స్వామి అమ్మవార్లు ఉయ్యాల ఊగుతుంటే, ఆ కదలికలకు అనుగుణంగా వారి ఆభరణాలు ఎలా అందంగా కదులుతున్నాయో అన్నమయ్య ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ పాట వింటే సాక్షాత్తు తిరుమలలో ఉత్సవం చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

రాగం: రాగ మాలికా / నీలాంబరి
తాళం: ఖండ చాపు

పల్లవి
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల ।
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥ (౧.౫)

చరణం 1
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల ।
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ॥ (౧.౫)

చరణం 2
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల ।
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ॥ (౧.౫)

చరణం 3
మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల ।
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ॥ (౧.౫)
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల ।
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥ (ప.) (౧.౫)

చరణం 4
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల ।
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ॥

చరణం 5
కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల ।
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ॥

చరణం 6
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల ।
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ॥

స్వామివారి ఊంజల్ సేవలో పాడుకునే ఈ Alara Chanchalamaina Lyrics in Telugu చదవడానికి మరియు వినడానికి ఎంతో మధురంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఈ గీతాన్ని మననం చేసుకుంటే ఆ దివ్య దంపతుల కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి.

Also Read this: Annamayya Keerthanas Adivo Alladivo in Telugu

Scroll to Top